రాయలసీమకు తాగునీటి కష్టాలు తప్పవు: శైలజానాథ్
AP: భవిష్యత్తులో రాయలసీమకు సాగు, తాగునీటి కష్టాలు తప్పవని మాజీమంత్రి శైలజానాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు 90% పూర్తయినా, CBN వాటిని నిలిపివేసి ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. రూ.15 వేల కోట్లతో సీమ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయడంలేదని ప్రశ్నించారు. వెంటనే ఆ ఇరిగేషన్‌ను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.