పొదలకూరు విద్యార్థినులకు ఫ్రీ కోచింగ్
NLR: ఇంటర్ ఫలితాల్లో పొదలకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు సత్తాచాటారు. ఆర్. ఇందు 967, కె.ప్రవల్లిక 966 మార్కులు సాధించారు. దీంతో వారిని బీసీ హాస్టల్ వార్డన్ సుధారాణి కలెక్టర్ హిమాన్షు శుక్లా వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను సత్కరించారు. నెల్లూరులో ఉచితంగా నీట్ కోచింగ్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.