ఈనెల 8న సామూహిక వరలక్ష్మీ వ్రతం

ఈనెల 8న సామూహిక వరలక్ష్మీ వ్రతం

ASF: ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని కంకలమ్మ ఆలయంలో ఈనెల 8న సామూహిక వరలక్ష్మీ వ్రతం పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ సుల్వ కనకయ్య తెలిపారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఆలయంలో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం ఉంటుందని తెలిపారు. ఆలయంలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తామని, మండలంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.