నగరంలో విస్తరిస్తోన్న టీ కేఫ్ సంస్కృతి
అనంతపురం నగరంలో రోజురోజుకు టీ కేఫ్ సంస్కృతి విస్తరిస్తోంది. సాయినగర్ నుంచి 44వ జాతీయ రహదారి తపోవనం కూడలి, బళ్లారి, కళ్యాణదుర్గం, రాప్తాడు సమీపంలో పెద్ద సంఖ్యలో కేఫ్‌లు ఏర్పడుతున్నాయి. సులభంగా, తక్కువ ఖర్చుతో కూడుకోవడంతో అందరూ ఈ బిజినెస్ పైనే మొగ్గుచూపుతున్నారు. రకరకాల అలంకరణలతో వ్యాపారస్థులు.. టీ ప్రియులను ఆకట్టుకుంటున్నారు.