బీఆర్ఎస్వీ నేతల ముందస్తు అరెస్టులు
BHNG: ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని BRSV పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడిని అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ BRSV నాయకులు ఓంటేదు లింగస్వామి, మలిగే బాలకృష్ణ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. హామీల అమలును ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం నిరంకుశ పాలనకు నిదర్శనమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.