నిధులను పక్కదారి పట్టించడం తగదు: మాజీ ఎమ్మెల్యే

SKLM: కూటమి ప్రభుత్వ హయాంలో పల్లెలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలే అన్నారు. గ్రామాలలో అభివృద్ధి, పారిశుధ్య పనులు చేపట్టేందుకు విడుదలవుతున్న నిధులు గ్రామపంచాయతీలకు చేరకుండా పక్కదారి పడుతున్నాయని విమర్శించారు.