రానున్న రోజుల్లో BRSదే అధికారం : మాజీ డిప్యూటీ సీఎం

JN: రానున్న రోజుల్లో బీఆర్ఎస్‌దే అధికారమని మాజీ డిప్యూటీ సీఎం డా. తాటికొండ రాజయ్య అన్నారు. గురువారం చిలుకూరు మండలం లింగంపల్లి గ్రామంలో ఆయన పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశమై పలు సూచనలను చేశారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని BRS పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు. స్థానిక ఎన్నికలపై కార్యకర్తల బలం చూపించాలని తెలిపారు.