ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు

NLG: కోదాడ పట్టణంలోని బుధవారం ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను జడ్పీహెచ్ఎస్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వరాష్ట్ర సాధనకై జీవితాన్ని దారపోసిన మహనీయుడు జయశంకర్ అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని క్లబ్ సభ్యులు పేర్కొన్నారు.