ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఇసుక దోపిడి

SDPT: జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఇసుక దోపిడీ జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇవ్వాలని నిర్ణయించినా, హుస్నాబాద్ నియోజకవర్గంలో ఒక్కో ట్రాక్టర్ ఇసుకకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు వసూలు చేస్తున్నట్లు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి, ఇసుక దోపిడీని అరికట్టాలని కోరారు.