VIDEO: చిన్నశేష వాహనంపై ఊరేగిన వెంకటరమణస్వామి

CTR: పుంగనూరులో శ్రీ కళ్యాణ వెంకటరమణస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత వెంకటరమణుడు చినశేష వాహనంపై వీధుల్లో ఊరేగారు. భక్తులు శ్రీవారిని దర్శించగా మహిళలు కర్పూర హారతులు పట్టారు. శ్రీవారి వాహనం ముందు ప్రత్యేకంగా కోలాటాలు, చెక్క భజనలు, కీర్తనలు, వాయిద్యాలతో కనువిందు చేశారు.