వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి: డిప్యూటీ DMHO

వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి: డిప్యూటీ DMHO

JGL: వెల్గటూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఓపీ, ఐపీ సేవలు, ల్యాబ్ రికార్డ్స్, మెడికల్ ఫార్మసిని ఆయన పరిశీలించారు. ఆసుపత్రిలో ప్రసూతి, వైద్య సేవలను మెరుగు పరచాలని సూచించారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని ఆదేశించారు.