ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ. 93 వేలు టోకరా

కరీంనగర్ మారుతీనగర్‌కు చెందిన శ్రీరామోజు రఘు ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో లాభాలు వస్తాయని నమ్మిన సైబర్ మోసగాళ్లకు రూ. 93 వేల వరకు మోసపోయాడు. మొదట రూ. 20 వేల ఇన్వెస్ట్ చేసి, ఆ తర్వాత మరో దశల్లో డబ్బులు పంపాడు. లాభాలు రాకపోవడంతో మోసపోయినట్టు గ్రహించి త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. త్రీటౌన్ సీఐ కేసు నమోదు చేసినట్టు తెలిపారు.