'వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలి'

'వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలి'

కోనసీమ: జలజీవన్ మిషన్ పథకం అన్ని గ్రామాల్లో అమలు చేయాలనీ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు కొన సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మండపేటలో మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే పంచాయితీ, మున్సిపల్ రక్షిత మంచినీరు ఉదయం 6 నుండి 8 గంటల వరకు, సాయంత్రం 1 గంట మాత్రమే ఇస్తారన్నారు. వేసవి దృష్డ్యా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.