పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులు విడుదల
KKD: జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విడుదల చేశారు. 30,820 మంది రైతులకు రూ.17 కోట్ల 42 లక్షలు జమ అయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంతోనే రైతులకు మేలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మూడు మండలాల వ్యవసాయ శాఖాధికారులు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.