విదేశీ విద్యా రుణాలు మంజూరు చేయాలి: ఎమ్మెల్యే

విదేశీ విద్యా రుణాలు మంజూరు చేయాలి: ఎమ్మెల్యే

సత్యసాయి జిల్లాలోని పేద విద్యార్థులకు విదేశీ విద్యా రుణాలు, రైతులకు పంట రుణాలు విస్తృతంగా మంజూరు చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి బ్యాంకర్లను కోరారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ శ్యాంప్రసాద్ అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళా సంఘాలు, స్వయం ఉపాధి రంగాలకు, అలాగే ఎన్టీఆర్-టిడ్కో ఇళ్లకు రుణాలు మంజూరు చేయాలని సూచించారు.