థార్ డ్రైవర్లపై డీజీపీ సంచలన వ్యాఖ్యలు
'థార్' కార్ల డ్రైవర్ల నిర్లక్ష్యంపై హర్యానా డీజీపీ ఓపీ సింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. థార్ వాహనాలను అతి వేగంతో, నిర్లక్ష్యంగా నడుపుతున్నారని అన్నారు. థార్‌ను కేవలం వాహనంగా కాకుండా, స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారని అభివర్ణించారు. రూఫ్‌పై కూర్చోవడం, సైడ్‌బోర్డులపై నిలబడటం వంటి స్టంట్ల వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని డీజీపీ పేర్కొన్నారు.