ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
KKD: యూ. కొత్తపల్లి మండలం మూలపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మూలపేట వద్ద ఆటో, బైకు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైకుపై ఉన్న వారిలో ఒకరు మృతి చెందగా, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని స్థానికుల సహాయంతో కాకినాడ జీజీహెచ్‌కు అంబులెన్స్‌లో తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.