కూలిన పార్టీ జెండా.. వ్యక్తి మృతి

కూలిన పార్టీ జెండా.. వ్యక్తి మృతి

విజయ్ దళపతి తమిళగ వెట్రి కళగం పార్టీ జెండా స్తంభం కూలి ఒకరు మృతి చెందిన ఘటన తమిళనాడులో జరిగింది. పార్టీ రెండో మహానాడు సందర్భంగా మదురైలో 100 అడుగుల ఎత్తైన TVK పార్టీ జెండా స్తంభాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో క్రేన్‌తో స్తంభాన్ని పైకి ఎత్తుతుండగా.. చైన్ తెగి ఆ స్తంభం పక్కనే ఉన్న కారుపై పడింది. దీంతో కారులో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.