చెస్ పోటీలో రాష్ట్రస్థాయికి ఎంపికైన శివ చరణ్
BHNG: భువనగిరిలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన అండర్-17 చెస్ ఛాంపియన్ పోటీలో శివ చరణ్ రాష్ట్రస్థాయి ఛాంపియన్స్‌కు ఎంపికయ్యాడు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బఖల్ వాడిలో పదవ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో పాఠశాలలో బుధవారం ఆ క్రీడాకారుడిని ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ రెడ్డి అభినందించారు.