ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేశాం: కేసీఆర్
TG: ఉద్యోగులకు తమ ప్రభుత్వంలో 72 శాతం PRC ఇచ్చామని మాజీ సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు 7 శాతమన్నా ఇచ్చారా? అని ప్రశ్నించారు. కనీసం రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా బెనిఫిట్స్ ఇస్తలేరన్నారు. సింగరేణి ఉద్యోగులను కంటికి రెప్పగా కాపాడుకున్నామన్నారు. తాము ప్రతి గ్రామంలో నర్సరీలు, వైకుంఠధామాలు, ప్రకృతివనాలు, క్రీడా ప్రాంగణాలు కట్టామన్నారు. కళకళలాడే గ్రామాలను నాశనం చేశారన్నారు.