నాణ్యమైన సురుచీకరమైన భోజనం..

కోనసీమ: అన్నార్తుల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్‌లో నాణ్యమైన సురుచీకరమైన భోజనం వడ్డిస్తున్నట్లు రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేటలోని అన్నా క్యాంటీన్‌ను ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్ పర్సన్ నూక దుర్గారాణి ఇవాళ పరిశీలించారు. రూ. 5 కే నాణ్యమైన భోజనం అందిస్తున్నారని వారు సంతృప్తి వ్యక్తం చేశారు.