ప్రయాణికులకు అలర్ట్.. భారీ ట్రాఫిక్ జామ్!
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. ఆదివారం షాపింగ్, తదిరత పనులపై స్థానికులు సాయంత్రం వేళలో ఒక్కసారిగా రోడ్లమీదకు రావడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. గుల్జార్ హౌస్, మదీనా, చార్మినార్, అఫ్జల్‌గంజ్, కోఠి నుంచి హైకోర్టు వైపు వాహనాల కదలిక చాలా నెమ్మదిగా ఉందని, ప్రయాణికులు తమ ప్రయాణాన్ని వీలైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.