అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

MHBD: తొర్రూర్ పట్టణంలో నివాసం ఉంటున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఉద్వాల దేవికి ఇవాళ ఉదయం 108 అంబులెన్స్‌లో తరలిస్తుండగా పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో అంబులెన్స్‌లోనే ఆమెకి సిబ్బంది ప్రసవం చేశారు. ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారు. ERCP adviseతో ప్రసవం చేసిన EMT MD.నజీర్, పైలెట్ ఏ రమేష్‌ను దేవి కుటుంబ సభ్యులు అభినందించారు.