నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు.. తప్పిన పెను ప్రమాదం

నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు.. తప్పిన పెను ప్రమాదం

SKLM: సంతబొమ్మాళి మండల కేంద్రంలో మెయిన్ లైన్11/33 కె.వి విద్యుత్ స్తంభాలు శుక్రవారం రాత్రి నేలకొరిగాయి. ఆ సమయంలో జన సంచారం లేకపోవడం వలన పెను ప్రమాదం తప్పింది. స్థానిక పాలేశ్వరం ఆలయం జంక్షన్ నుంచి గ్రామం వైపు వెళ్లే మెయిన్ రహదారిలో డ్రైనేజీ నిర్మాణానికి సంబంధించి ఇటీవల పనులు జరిగాయి. 2 రోజుల క్రితం తేలికపాటి వర్షం కురవడంతో నేల తడిచి స్తంభాలు పడిపోయాయి.