అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు కేంద్ర మంత్రికి ఆహ్వానం

అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు కేంద్ర మంత్రికి ఆహ్వానం

ప్రకాశం: కనిగిరిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ప్రత్యేక అతిథిగా రావాలని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖమంత్రి చిరాగ్ పాస్వాన్‌ను ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఢిల్లీలో కలిసి ఆహ్వానించారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా కనిగిరిలో విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కేంద్రమంత్రికి మాగుంట తెలిపారు. మంత్రి సానుకూలంగా స్పందించారు.