శ్రీ రామనారాయణంలో అలరించిన భక్తి సంగీతం కార్యక్రమం

VZM: ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం శ్రీ రామనారాయణంలో ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌కు చెందిన S.L.V మ్యూజిక్ అకాడమీ నేతృత్వంలో భక్తి సంగీతం (భక్తి గీతాలు) కార్యక్రమాన్ని నిర్వహించారు. దర్శకులు చింతా నాగార్జున, మృదంగం శేష లక్ష్మీ నరసింహ శర్మ, వయోలిన్ శ్రీనివాసా చారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిపారు. ఈ భక్తి గీతాలు ఆధ్యాంతం ఆహుతులను అలరించాయి.