దారుణం.. గుర్తుతెలియని మహిళ దారుణ హత్య
TG: హైదరాబాద్ జవహర్‌నగర్ పీఎస్ పరిధిలోని ధమ్మాయిగూడలో దారుణం జరిగింది. ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు హత్య చేసి, మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న మహిళ మతదేహాన్ని పరిశీలించగా ఆధారాలు దొరకలేదు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.