కేంద్రమంత్రి గడ్కరీతో మంత్రి లోకేష్ భేటీ

కృష్ణా: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి లోకేష్ సోమవారం భేటీ అయ్యారు. కానూరు-మచిలీపట్నం రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకోవాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. విజయవాడ బెంజ్ సర్కిల్ ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా రోడ్డు విస్తరణకు వినతి సమర్పించారు. కానూరు-మచిలీపట్నం 6 లైన్ల రోడ్డు విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీచేయాలన్నారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిచారు.