ఘనంగా డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు

KDP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను మైదుకూరులో జనసేన నేతలు ఘనంగా నిర్వహించారు. జనసేన నేతలు మార్కెట్ కమిటీ డైరెక్టర్ భరత్, జనసేన సీనియర్ నాయకులు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్‌లు పంపిణీ చేశారు.