VIDEO: మేడారం జాతర పనులపై మంత్రి సీతక్క సమీక్ష
MLG: తాడ్వాయి మండలం మేడారం జాతర సమీపిస్తుండడంతో అభివృద్ధి పనులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క బుధవారం పరిశీలించారు. సీఎం మేడారం దర్శనానికి రానున్న నేపథ్యంలో సభా స్థలాన్ని కూడా పరిశీలించారు. ముందస్తు మొక్కులు చెల్లించేందుకు వచ్చే భక్తులకు ఆటంకాలు లేకుండా దర్శనాలు, భద్రత సౌకర్యాలు కల్పించాలని, గడువులోపు పనులు పూర్తి చేయాలని మంత్రి సూచించారు.