మోపిదేవిలో నేడు విద్యుత్ అంతరాయం

మోపిదేవిలో నేడు విద్యుత్ అంతరాయం

కృష్ణా: మోపిదేవి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని 11కేవీ బొబ్బర్లంక ఫీడర్ హైటెన్షన్ వైర్లకు తగులుతున్న చెట్ల కొమ్మలను ట్రిమ్ చేయుట కారణంగా మంగళవారం విద్యుత్తుకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ పాండురంగారావు తెలిపారు. బొబ్బర్లంక, పెద్దప్రోలు, కోక్కిలిగడ్డ, కే.కొత్తపాలెం, శివరాంపురం గ్రామాలలో ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు కరెంటు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.