విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే

విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే

WGL: గీసుగోండ మండలంలోని మొగిలిచర్ల, విశ్వనాధపురం గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ల పనులను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సోమవారం పరిశీలించారు. త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో లోవోల్టేజ్ సమస్యలు లేకుండా వ్యవసాయ, గృహ, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.