నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ADB: భైంసా పట్టణం, నర్సాపూర్(జి) మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆ శాఖ ఏఈ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ మరమ్మతులు కారణంగా నర్సాపూర్(జి)ఉప కేంద్రం పరిధిలో ఉన్న నర్సాపూర్(జి),కుస్లి,అంజని తండా, గ్రామాలకు శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఆయన పేర్కొన్నారు. కావున వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.