హిందూ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ

SRD: పహల్‌గామ్‌లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ శనివారం సదాశివపేట పట్టణంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని మాణిక్ ప్రభు మందిరం నుంచి మొదలైన ర్యాలీ పురవీధుల గుండా స్థానిక పోలీస్ స్టేషన్ వరకు నిర్వహించారు. అనంతరం సీఐ మహేష్ గౌడ్‌కు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు.