ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

NLR: కోవూరు లారీ యార్డ్ సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి నుంచి వైజాగ్ వెళ్తున్న కారు ముందున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. మరో వ్యక్తికి స్వల్ప గాయాలు కావడంతో 108 ద్వారా నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారు ఎం.ఫణి, కె. కృష్ణగా పోలీసులు గుర్తించారు.