పోలీసులు విలేకరుల మధ్య వాగ్ వివాదం
BDK: నేడు పంచాయతీ తొలి విడుత ఎన్నికల సందర్భంగా బూర్గంపాడు మండలంలో అధికారులు, స్థానిక రిపోర్టర్ల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు అధికారులు, పోలీసులు తమ పట్ల దురుసుగా వ్యవహరించారని, సమాచారం ఇవ్వకుండా అడ్డుకున్నారని స్థానిక విలేకరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.