ఈనెల 11న శ్రీ లక్ష్మీనరసింహస్వామి శాంతి కళ్యాణం

ఈనెల 11న శ్రీ లక్ష్మీనరసింహస్వామి శాంతి కళ్యాణం

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని దేవాంగ నగర్‌లో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవం ఈనెల 11న జరగనుంది. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి శాంతి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కుందూరు తిరుపతిరెడ్డి ఆదివారం తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి శాంతి కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు.