విజయ్‌కు మరోసారి సీబీఐ నోటీసులు

విజయ్‌కు మరోసారి సీబీఐ నోటీసులు

తమిళనాడు టీవీకే పార్టీ చీఫ్ విజయ్‌కు సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈనెల 15న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఆయనతో పాటు కరూర్ ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీకి కూడా నోటీసులు ఇచ్చింది. ఈనెల 17న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఇద్దరినీ సీబీఐ అధికారులు ఢిల్లీలోనే ప్రశ్నించనున్నారు. కరూర్ తొక్కిసలాట, మరణాల కేసులో విచారణ చేపట్టనున్నారు.