VIDEO: ఐజలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

VIDEO: ఐజలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

GDWL: ఐజ మున్సిపాలిటీ పరిధిలోని మడ్డిగుంత వీధిలో గురువారం కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. మోకాలు లోతుకు చేరిన వర్షపు నీటితో వీధి చెరువును తలపిస్తోంది. గుంతల వల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షపు నీరు వీధుల్లో నిలిచిందని, దీనిపై అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.