నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో జీవించాలి: ఎస్పీ
KRNL: జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర గలవారికి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు SP విక్రాంత్ పాటిల్ ఆదివారం తెలిపారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో జీవించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పోలీసు అధికారులు సూచించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.