స్కూల్ బస్సు కింద పడి బాలుడు మృతి
BDK: ఓ ప్రైవేటు స్కూల్ బస్సు చక్రాల కింద పడి మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన చంద్రుగొండ మండలం కరిసలబోడు తండాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన భూక్యా గోపి, అఖిల దంపతులకు 3 సం.రాల కుమారుడు భూక్యా దర్శిత్ నాయక్ ఉన్నాడు. జూలూరుపాడుకు చెందిన సాయి ఎక్సలెంట్ స్కూల్ బస్సు విద్యార్థుల కోసం వచ్చినప్పుడు అనుకోకుండా బస్సు చక్రాల కింద పడినట్లు తెలిపారు.