నిరుపయోగంగా మారిన కళాశాల భవనాలు

నిరుపయోగంగా మారిన కళాశాల భవనాలు

SRD: సంగారెడ్డి పట్టణంలోని రాజంపేట శివారులో రూ.34 కోట్లతో నిర్మించిన నర్సింగ్ కళాశాల భవనాలు నిరుపయోగంగా మారాయి. ఆరు నెలల క్రితమే తరగతి గదులు, వసతి గృహాల నిర్మాణం పూర్తయినా.. ప్రారంభించడంలో అధికారులు తాత్సారం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన భవనం పాడవ్వకముందే అధికారులు స్పందించి, త్వరగా ప్రారంభించాలని కోరారు.