మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
KMM: మధిర మండలం నాగులవంచ పీఎసీఎస్ పరిధిలో చిన్న మండవ గ్రామంలో మొక్కజొన్న మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఏఎంసీ ఛైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. రైతు కష్టపడి పండించిన పంటను బహిరంగ మార్కెట్‌లో దళారులకు అమ్మకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.