తాగునీటి సరఫరాపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
KRNL: జిల్లాలో తాగునీరు సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని కలెక్టర్ సిరి బుధవారం వెల్లడించారు. కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ఈవో ఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.