ఓపెన్ SSC పరీక్షలకు 88% హాజరు
KMR: జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ముగిసాయి. జిల్లాల్లో ఓపెన్ టెన్త్ ఆంగ్ల పరీక్షలకు 6 పరీక్షా కేంద్రాల్లో 985 మందికి 865 మంది విద్యార్థులు హాజరు కాగా 120 మంది గైర్హాజరయ్యారని DEO రాజు వెల్లడించారు. ఓపెన్ ఇంటర్ ఆంగ్ల పరీక్షలకు 8 పరీక్షా కేంద్రాల్లో 1788 మందికి 1628 మంది విద్యార్థులు హాజరు కాగా 159 మంది గైర్హాజరయ్యారన్నారు.