పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీ
BPT: చందోల్ మండల పరిధిలో వివిధ సందర్భాల్లో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. మంగళవారం చందోలు పోలీస్ స్టేషన్‌లో ఎస్సై శివకుమార్ రికవరీ చేసిన ఫోన్లను బాధితులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఫోన్లు పోగొట్టుకున్న వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. తమ ఫోన్లను తిరిగి అప్పగించిన ఎస్సైకి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.