కాకుమానులో దస్తావేజు లేఖరుల పెన్ డౌన్ నిరసన

కాకుమానులో దస్తావేజు లేఖరుల పెన్ డౌన్ నిరసన

GNTR: కాకుమాను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజు లేఖరులు రేపటి నుంచి రెండు రోజుల పాటు పెన్ డౌన్ నిరసన చేపట్టనున్నారు. ఈ మేరకు గురువారం సబ్ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేశారు. రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల కూడా ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నిరసన చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు.