రజినీ, కమల్ సినిమా షూటింగ్‌పై అప్‌డేట్
తమిళ స్టార్స్ రజినీకాంత్, కమల్ హాసన్ కాంబోలో భారీ ప్రాజెక్టు రాబోతుంది. దీని షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీపై మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అప్‌డేట్ ఇచ్చాడు. 2027లో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలిపాడు. ఇక దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించనున్న ఈ మూవీని 80s, 90sలో వాడిన ఫిల్మ్ కెమెరాలతో షూట్ చేయనున్నారట.