పూడికతీత పనులను పర్యవేక్షించిన కలెక్టర్

పూడికతీత పనులను పర్యవేక్షించిన కలెక్టర్

NZB: జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు నివాస ప్రాంతాలు, మురికి కాల్వల్లో పూడికతీత పనులను గురువారం కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, CP సాయిచైతన్య పరిశీలించారు. వర్షం నీరు నిల్వ ఉండకుండా పూడికతీత పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తిస్థాయిలో శుభ్రం చేయాలని వారు నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. నగరంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించారు.