'అమెజాన్ క్లౌడ్' సదుపాయాలపై ఇరాన్ దాడి!
ఇరాన్ దాడిలో బహ్రెయిన్‌లోని అమెజాన్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసమైనట్లు తెలుస్తోంది. హమాలాలోని 'బాటెల్కో' టెలికమ్యూనికేషన్స్ కార్యాలయం లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. పశ్చిమాసియాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్, మెటా వంటి అమెరికా కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించిన మరుసటి రోజు తర్వాత ఈ దాడి జరగడం గమనార్హం.